సందేశాత్మక కథతో "మిస్సింగ్" సినిమ


విశాఖపట్నం,నిజం న్యూస్ 
 ప్రస్తుత సమాజంలో స్త్రీల పై జరుగుతున్న దాడుల నేపథ్యంలో, స్త్రీ వేసే ప్రతి అడుగు మనుగడకు దిశానిర్దేశం లాంటివని, అలాంటి స్త్రీని  ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి జీవితం ఏ విధంగా మారడానికి కారణం అయింది, ఆ కారణం ఎన్ని మార్పులకు, అనర్థాలకు దారితీసింది అనే ప్రధాన అంశం తో "మిస్సింగ్" అనే చిత్రాన్ని రూపొందించనున్నట్లు సినిమా నిర్మాత, డైరెక్టర్ డాక్టర్. కోరుకొండ గోపి కృష్ణ తెలిపారు. వీ జే ఎఫ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మిస్సింగ్ సినిమా పోస్టర్ రిలీజ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తాను స్వతహాగా ఇంజనీరింగ్ కాలేజ్ లో ప్రొఫెసర్ గా పని  చేస్తున్నారన్నారు. సినిమాలపై ఉండే మక్కువతో సమాజానికి మంచి కథతో సినిమా అందివ్వాలనే ఉద్దేశంతో ఈ సినిమా ను తీస్తున్నానన్నారు. ఈ సినిమాను పూర్తిగా విశాఖ  నటీనటులతో చిత్రీకరిస్తున్నానాన్నా రు. విశాఖ పరిసర ప్రాంతాలను ఈ చిత్రంలో చూడొచ్చన్నారు.  ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సినిమా హీరో అనిల్, నటీనటులు దార్ల, వెన్నెల,  బైలoపూడి బ్రహ్మానందరెడ్డి, కుమార్ రాజా, కెమెరామెన్ హేమ వర్ధన్, మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎల్. రాజా, డాన్స్ మాస్టర్ పవన్, ఆర్ట్ డైరెక్టర్ జే. రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.